సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు
- వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో మర్యాదపూర్వక భేటీ
- పీసీసీ అధ్యక్షుడు, మంత్రి, ఎంపీ తదితరుల హాజరు
- ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌కు చెందిన 8 మంది కౌన్సిలర్ల సమావేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్): జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ కు చెందిన 8 మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం.
సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లలో కుర్వ పావని (1వ వార్డు), శారద (2వ వార్డు), మంజుల (4వ వార్డు), యుగేందర్ రెడ్డి (5వ వార్డు), దేవమ్మ (6వ వార్డు), విజయ్ భాస్కర్ (7వ వార్డు), జయశ్రీ (8వ వార్డు), ఎరుకల తిమ్మప్ప (10వ వార్డు) ఉన్నారు. జిల్లా అభివృద్ధి, మున్సిపల్ సమస్యల పరిష్కారం, ప్రజా అవసరాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
