రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హాస్టళ్లలో శానిటేషన్, ఆహార నాణ్యతకు ప్రాధాన్యం

మార్చిలోగా 814 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు

అమరావతి, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం సూచించారు. విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించేందుకు 814 హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చి నెలలోగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే రూ.60 కోట్ల సాస్కి నిధులతో కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ఎలాంటి రాజీ ఉండకూడదని, వసతి గృహాల్లో మౌలిక వసతులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-