ముఖం ప్రభాస్‌ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!!
ముఖం ప్రభాస్‌ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!!
హైదరాబాద్ – 8 ఫిబ్రవరి – పీపుల్స్ మోటివేషన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా సందడి చేస్తోంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ తర్వాత మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అయితే ఈసారి సినిమాపై ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ బాడీ డబుల్ వాడకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
ఓటీటీలో హై-డెఫినిషన్ క్వాలిటీలో సినిమా చూసిన ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని సూక్ష్మంగా గమనిస్తున్నారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్ మూమెంట్స్‌లో ప్రభాస్ స్థానంలో బాడీ డబుల్‌ను ఉపయోగించి, ఫేస్ స్వాప్ లేదా హెడ్ రీప్లేస్‌మెంట్ టెక్నాలజీతో ప్రభాస్ ముఖాన్ని అతికించినట్టు స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మేకర్స్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
దీనితో పాటు సినిమాల్లో కనిపిస్తున్న కంటిన్యుటీ లోపాలు కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని సీన్లలో ప్రభాస్ గడ్డంతో కనిపించి, మరుసటి సీన్‌లో ఒక్కసారిగా క్లీన్ షేవ్ లుక్‌లోకి మారిపోవడం, నడక శైలిలో తేడాలు ఉండటం వంటి విషయాలు నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. థియేటర్ వెర్షన్‌లో లేని కొన్ని ‘ఓల్డ్ గెటప్’ సీన్లను ఓటీటీ కోసం ఎక్స్‌టెండెడ్ కట్‌గా జోడించినప్పటికీ, వాటిలో కూడా విజువల్ క్వాలిటీ బాగాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ బాడీ డబుల్ వ్యవహారంపై దర్శకుడు మారుతి గతంలో స్పందించారు. నేటి కాలంలో హీరోల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా డూప్స్ వాడటం సాధారణమే అని ఆయన సమర్థించుకున్నారు. అయితే ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ విషయంలో గ్రాఫిక్స్ పనితీరు మరింత మెరుగ్గా ఉండాల్సిందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ హీరో ట్రోలింగ్‌కు గురవుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
