రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సంక్రాంతి హిట్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్‌పై ఆసక్తి..!

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సంక్రాంతి హిట్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్‌పై ఆసక్తి..!

హైదరాబాద్ – 8 ఫిబ్రవరి – పీపుల్స్ మోటివేషన్ 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేశాయి. ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలు వరుసగా థియేటర్లలోకి వచ్చాయి. పండుగ సీజన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న ఈ చిత్రాలు థియేటర్లలో మంచి వసూళ్లు సాధించాయి.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ నటించిన చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాల స్ట్రీమింగ్ తేదీలను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ రిలీజ్‌పై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నప్పటికీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని స్థిరమైన కలెక్షన్లు సాధించింది.

తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 దక్కించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా, సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందుతుందా లేదా చూడాలి

Comments

-Advertisement-