రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ నిరసన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ నిరసన

- ప్రధాన ప్రతిపక్ష హోదాపై ఆందోళన

- శాంతి భద్రతల అంశంపై చర్చకు డిమాండ్

- నినాదాలతో మార్మోగిన అసెంబ్లీ ప్రాంగణం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 11 (పీపుల్స్ మోటివేషన్):
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిన అంశంపై ప్రభుత్వం నిలదీయనివ్వడం లేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పార్టీ శ్రేణులు నినాదాలతో మార్మోగించారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Comments

-Advertisement-