రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రహదారి పనులు నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రహదారి పనులు నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలి

  • ఇందిరాభవన్‌లో ఆర్‌అండ్‌బీ సమీక్ష సమావేశం
  • వంతెనలు, నాలుగు లేన్ల రహదారులకు గడువులు
  • నాణ్యతలో రాజీ లేదని స్పష్టీకరణ
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో జరుగుతున్న రహదారులు, వంతెనల నిర్మాణ పనుల పురోగతిపై ఈ రోజు నల్గొండలోని ఇందిరాభవన్‌లో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కీలక మార్గాల నిర్మాణం ఆలస్యం కాకుండా వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుద్ధారం–అప్పాజిపేట–బ్రాహ్మణవెల్లం రహదారి పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. సోమనవాగుపై పగిడిమర్రి వంతెన నిర్మాణాన్ని మూడు నెలల్లో ముగించాలని గడువు విధించారు. కనగల్ జంక్షన్–కనగల్ నాలుగు లేన్ల రహదారి, కనగల్–తిమ్మన్నగూడెం, మామిడాల తదితర గ్రామాల రహదారి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

జిల్లాలో రహదారి అనుసంధానం బలోపేతం అయితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే గ్రామీణ ప్రాంతాలకు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రహదారులు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. నిర్ణీత గడువులు పాటించని కాంట్రాక్టర్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలిపారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Comments

-Advertisement-