రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఘన నిర్వహణ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఘన నిర్వహణ

  • కేసీఆర్ పాలనలో అధికారిక గుర్తింపు
  • గిరిజన సంక్షేమానికి తీసుకున్న కీలక నిర్ణయాలు
  • భోగ్ బండార్‌కు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 14 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ భవన్‌లో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే సేవాలాల్ మహారాజ్ జయంతికి అధికారిక గుర్తింపు లభించిందని ఆమె గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం జయంతి నిర్వహణకు రెండు కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా గిరిజనుల పట్ల కేసీఆర్ చూపిన ఆత్మీయత స్పష్టమైందన్నారు. కేసీఆర్ పాలన గిరిజన, ఆదివాసీ బిడ్డలకు స్వర్ణయుగంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నాలుగు శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లను కేసీఆర్ పదశాతానికి పెంచినట్లు వివరించారు. 2700కు పైగా గిరిజన, ఆదివాసీ, చెంచు గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్థానిక స్వయం పాలనకు బలాన్నిచ్చారని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 25 కోట్ల వ్యయంతో సేవాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మించడంతో పాటు ఆదివాసీల కోసం కొమురం భీం భవనాన్ని కూడా నిర్మించారని పేర్కొన్నారు. ఒకే రోజు నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతికి అధికారిక గుర్తింపు తెలంగాణలో ఇచ్చిన తరువాతే ఇతర రాష్ట్రాలు కూడా గుర్తింపు ఇచ్చాయని తెలిపారు. ఎస్టీలకు గురుకులాలను స్థాపించడం ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలను సాధించే అవకాశాలు పొందారని పేర్కొన్నారు.

కేసీఆర్ గిరిజనుల కోసం చేసిన సేవలకు వారు ఎప్పటికీ రుణపడి ఉంటారని సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు గిరిజన, ఆదివాసీ సమాజం పట్టుదలతో పని చేస్తుందని తెలిపారు. రేపు ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్‌లో భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించనున్నామని, గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-