రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రిది పరిశీలన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రిది పరిశీలన

  • సురక్షిత తాగునీరు, పారిశుధ్యంపై కఠిన ఆదేశాలు
  • రోగుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యక్ష విచారణ
  • భవిష్యత్తుకు సమగ్ర నివారణ ప్రణాళిక

ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్): కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఈ రోజు శ్రీకాకుళంలో ఇటీవల నమోదైన డయేరియా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి అధికారులతో చర్చించారు. ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు తక్షణమే మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్య పూర్తిగా తీరే వరకు పరిశుభ్రత పద్ధతులను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. నీటి నిల్వలు, మురుగు ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Health news Health tips Health updates in Telugu Health newsIndia Good health news HealthNews Daily health tips health tips in Telugu Health care news

ఇటీవల ఆసుపత్రి నుంచి విడుదలైన రోగులను వారి ఇళ్ల వద్ద కలసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయం అందించేందుకు నిత్యవసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తదుపరి రిమ్స్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మరియు కిమ్స్ ఆసుపత్రిలను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అవసరమైన వైద్యసహాయం పూర్తిస్థాయిలో అందించి, త్వరితగతిన కోలుకునేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సమగ్ర నివారణ చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-