రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ అంశంపై మండలిలో వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ అంశంపై మండలిలో వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన

- చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వాయిదా తీర్మానం

- ప్రభుత్వ నిరాకరణతో నినాదాలు చేసిన సభ్యులు

- ఐదు నిమిషాల పాటు మండలి వాయిదా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసనమండలిలో చర్చించాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన విషయంపై పూర్తి స్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం సమర్పించారు. అయితే ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మండలి ఛైర్మన్ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీనికి నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. “చర్చించాల్సిందే” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మండలిని ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి అంశంపై స్పష్టత ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఏ తప్పూ చేయకపోతే చర్చకు భయపడాల్సిన అవసరం ఏముందని సభ్యులు ప్రశ్నించారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై పారదర్శక చర్చ జరగాలనే తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని వైయస్‌ఆర్‌సీపీ స్పష్టం చేసింది.

Comments

-Advertisement-