రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి జైలు నుంచి విడుదల

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి జైలు నుంచి విడుదల

- పైరసీ కేసులో షరతులతో కూడిన బెయిల్

- మూడు నెలల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి విడుదల

- కఠిన నిబంధనలు విధించిన హైకోర్టు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
తెలుగు సినిమా పైరసీకి కేంద్రంగా మారిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. పైరసీ కేసులో అరెస్టయిన రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన విడుదలయ్యారు. తెలుగు సినిమాలను అక్రమంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ పైరసీకి పాల్పడినట్లు ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు గత నవంబరులో రవిని అరెస్టు చేశారు. విదేశాల నుంచి వెబ్‌సైట్ నిర్వహిస్తూ, బెట్టింగ్ యాప్‌ల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం ఆర్జించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ చర్యల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. అరెస్టు అనంతరం రవి పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుకూల నిర్ణయం రాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ కె. సుజాన నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించి బెయిల్ మంజూరు చేసింది. తొంభై రోజులకుపైగా జైలులో ఉన్నాడు, ఇంకా చార్జ్‌షీట్ దాఖలు కాలేదనే అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే, కోర్టు కఠిన షరతులు విధించింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును సమర్పించాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఉదయం పదకొండు గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. రవి విడుదలతో ఈ కేసు దర్యాప్తు తదుపరి దశ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Comments

-Advertisement-