రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బంగ్లాదేశ్‌లో హిందువుల హక్కులపై మోహన్ భగవత్ వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బంగ్లాదేశ్‌లో హిందువుల హక్కులపై మోహన్ భగవత్ వ్యాఖ్యలు

- హక్కుల కోసం పోరాడితే ప్రపంచ హిందువుల మద్దతు

- బంగ్లాలో హిందువులపై దాడులపై ఆందోళన

- ఆరెస్సెస్ లక్ష్యం సమాజ ఐక్యతే అని స్పష్టం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ముంబై, ఫిబ్రవరి 8, 2026 (పీపుల్స్ మోటివేషన్):
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది హిందువులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆరెస్సెస్ వందేళ్లు పూర్తైన సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొని మాట్లాడారు. కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై హత్యలు, దాడులు, దోపిడీలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి హిందువులు భయపడకుండా తమ హక్కుల కోసం పోరాడాలని, అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం సంఘీభావంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారతదేశంలోనూ మైనారిటీలు, జనాభా మార్పులు, అక్రమ వలసల అంశాలపై భగవత్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యలను సకాలంలో గుర్తించి స్పందించలేదని విమర్శించారు. కొన్ని వర్గాల్లో అధిక జననాల రేటు, అక్రమ వలసల వల్ల పరిస్థితులు మారాయని, ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశాలపై చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరెస్సెస్ కులాలకు అతీతమైన సంస్థ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష లేదని, అన్ని వర్గాలను ఏకం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. బ్రాహ్మణులు స్థాపించిన సంస్థ అయినప్పటికీ, ఎవరైనా ఆరెస్సెస్ అధ్యక్షుడిగా ఎదగవచ్చని వివరించారు. నిధుల సేకరణపై స్పందిస్తూ, ఆరెస్సెస్ తన కార్యకర్తల నుంచే విరాళాలు సేకరిస్తుందని తెలిపారు. హోటళ్లలో బస చేయకుండా కార్యకర్తల ఇళ్లలోనే ఉంటామని, భోజనానికి డబ్బులు అడగకుండా ఆహారమే కోరుతామని చెప్పారు. తమకు అధికార లాలస లేదని, సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యమని భగవత్ స్పష్టం చేశారు.

Comments

-Advertisement-