కనకదుర్గమ్మ సన్నిధిలో ఏపీ బడ్జెట్ ప్రతుల పూజ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కనకదుర్గమ్మ సన్నిధిలో ఏపీ బడ్జెట్ ప్రతుల పూజ
- రూ.3.32 లక్షల కోట్లతో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- అమరావతి, మౌలిక వసతులు, వ్యవసాయానికి భారీ కేటాయింపులు
- రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు
అమరావతి, 14 ఫిబ్రవరి 2026 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు హాజరై వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,32,205 కోట్ల పరిమాణంతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు ఉంటుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించేలా బడ్జెట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.13,546 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.4,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అభివృద్ధికి రూ.30,000 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. మౌలిక వసతులు, వ్యవసాయం, సామాజిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న బడ్జెట్ ఇదని ప్రభుత్వం పేర్కొంది.
Comments
