రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సీఎం చంద్రబాబుకు పెద్దజీయర్ స్వామి లేఖ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సీఎం చంద్రబాబుకు పెద్దజీయర్ స్వామి లేఖ

కల్తీ నెయ్యితో ప్రసాదం కొనసాగించడం మహా అపచారం

భక్తుల ఆత్మవిశ్వాసానికి భంగం – ధర్మానికి విరుద్ధం

బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆక్షేపణ

తిరుపతి, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో పెద్దజీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెయ్యి కల్తీ అని తెలిసినప్పటికీ ప్రసాద తయారీలో దానిని కొనసాగించడం మహా అపచారమని స్పష్టంగా పేర్కొన్నారు.కోట్లాది మంది భక్తుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల లడ్డూ విషయంలో ఇటువంటి నిర్లక్ష్యం ధర్మానికి విరుద్ధమని పెద్దజీయర్ స్వామి లేఖలో పేర్కొన్నారు. ఇది అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణిస్తూ, భక్తుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదని, అది భక్తుల నమ్మకం, సంప్రదాయం, ఆధ్యాత్మిక భావనలతో ముడిపడి ఉందని లేఖలో వివరించారు. అలాంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ అంశం బయటపడటం బాధాకరమని, దీనిపై స్పష్టమైన చర్యలు అవసరమని సూచించారు.

ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దజీయర్ స్వామి లేఖలో కోరినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ అమలు చేయాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని లేఖలో స్పష్టం చేశారు.

Comments

-Advertisement-