రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మధిర భవిష్యత్తే మా లక్ష్యం: భట్టి విక్రమార్క

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మధిర భవిష్యత్తే మా లక్ష్యం: భట్టి విక్రమార్క

రాజకీయాల కోసం కాదు… రాబోయే 50 ఏళ్ల అవసరాల కోసం ఎన్నికలు

‘ఆదర్శ పట్టణం’గా మధిరను తీర్చిదిద్దుతాం

మధిర, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మధిర మున్సిపాలిటీ ఎన్నికలు కేవలం రాజకీయాల కోసమే కాదని, మధిర భవిష్యత్తును నిర్ణయించే కీలక సందర్భమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో మధిరను ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఆలోచించి వినియోగించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, మార్పు కోరుకునే ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి మధిర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని కోరారు. మన మధిర మన బాధ్యత అని పేర్కొన్న భట్టి విక్రమార్క, పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మధిరను ముందుకు నడిపిస్తుందని, ప్రజలు మార్పుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-