రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మా ప్రభుత్వం కారణంగా మేం నవ్వులపాలయ్యాం.. బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మా ప్రభుత్వం కారణంగా మేం నవ్వులపాలయ్యాం.. బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ

హైదరాబాద్ – ఫిబ్రవరి 20 – పీపుల్స్ మోటివేషన్ 

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్ జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి తప్పించిన ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేయడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాటలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ ప్రభావితమయ్యారని ఆరోపించారు. ఒక క్రికెట్ పరిపాలకుడిగా తాను నిబద్ధత, నిజాయితీని విశ్వసిస్తానని పేర్కొన్న ఆయన అమీనుల్ ఇస్లామ్ అమాయకుడని, నఖ్వీ వలలో పడ్డారని వ్యాఖ్యానించారు. నఖ్వీ ఒత్తిడికి లోనై తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికి ప్రయోజనం కలగలేదని అన్నారు. ప్రపంచ కప్ వివాదం సమయంలో మా ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు సరైన కారణాలు లేవని విమర్శించారు. బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారత నిర్వాహకుల మద్దతు ఎంతో అవసరమని స్పష్టం చేస్తూ గతంలో జగన్మోహన్ దాల్మియా కాలంలో తమ దేశానికి గౌరవం, గుర్తింపు లభించేదని గుర్తుచేశారు. ప్రస్తుతం కొంతమంది వ్యక్తుల నిర్ణయాలు మరియు ప్రభుత్వ చర్యల కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ ప్రపంచ వేదికపై నవ్వులపాలైందని సయ్యద్ అస్రాఫుల్ హక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-