భారత్ సెమీస్‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
భారత్ సెమీస్‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ – ఫిబ్రవరి 20 – పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సెమీస్ ఫైనల్‌కు చేరే అవకాశం లేనని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్-8లో భాగంగా రేపటి నుంచి జరగనున్న మ్యాచ్‌లలో ఎనిమిది జట్లు టైటిల్ కోసం తగినంత శ్రమ చేస్తున్నారు. పాకిస్థాన్ న్యూస్ చానెల్ డిబెట్లో మాట్లాడిన ఆమిర్.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్ప, లీగ్ దశలో ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిందని, అందుకే ఈ జట్టు సెమీస్ చేరే అవకాశాలు తక్కువ అని పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు అద్భుతంగా ఆడుతున్నాయని, ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఆ జట్లకు ఉందని చెప్పారు. అయితే ఇతర ప్యానెలిస్టులు టీమిండియా సెమీస్ చేరే అవకాశం ఉందని, పాక్, భారత్ మ్యాచ్‌ను సెమీస్‌లో ఆసక్తికరంగా చూడవలసిందని, టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని అభిప్రాయాలు తెలిపారు. 2009లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆమిర్, రిటైర్ అయిన తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి తరచూ భారత్‌పై తన అక్కసును వ్యక్తం చేస్తున్నాడు. ఆయన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎడిషన్‌లో అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పడిన విషయం గుర్తు చేసుకొని, తన జట్టు గురించి ఆలోచించాలని, భారత్ మినహాయించి మరెవరూ ఆమిర్ మాటలపై ఊరుకోవద్దని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
