పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
- నెల్లూరు కలెక్టరేట్‌లో పోష్ చట్టంపై చర్చ
- ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు అవసరం
- మహిళల రక్షణ హక్కు అని స్పష్టం
నెల్లూరు, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్): మహిళలపై కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నిరోధించే చట్టం అమలుపై నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సైలజా రాయపాటి పాల్గొని పోష్ చట్టం ప్రాముఖ్యతను వివరించారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడం కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదని, అది మహిళల హక్కు అని ఆమె పేర్కొన్నారు. ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ ద్వారా మహిళల్లో భరోసా పెంపొందించవచ్చని తెలిపారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు. మహిళల భద్రతే మహిళా కమిషన్ ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ సైలజా రాయపాటి స్పష్టం చేశారు. కార్యాలయాల్లో సురక్షిత వాతావరణం కల్పించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
Comments
