రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • కష్టకాలంలో పార్టీ విడిచినవారికి తిరిగి అవకాశం లేదని స్పష్టం
  • బంధుప్రీతితో తీసుకొస్తే తీవ్ర చర్యల హెచ్చరిక
  • వెన్నుపోటుదారులను క్షమించబోమని ఘాటు వ్యాఖ్య

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ధర్మవరం, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో వదిలి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బంధుప్రీతి చూపుతూ తిరిగి పార్టీలో చేర్చాలని ప్రయత్నిస్తే సహించబోమని, అలా చేసే వారిని తీవ్రంగా ఎదుర్కొంటానని ఘాటుగా హెచ్చరించారు. పార్టీకి కష్ట సమయంలో అండగా నిలవని వారిని తిరిగి స్వీకరించడం సరికాదని వ్యాఖ్యానించారు. శత్రువైన పార్టీలో ఉన్న వారిని అవసరమైతే చేర్చుకునే పరిస్థితి వచ్చినా, వెన్నుపోటు దారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని పేర్కొన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విశ్వాసమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

 కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లోపల, బయట విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

-Advertisement-