రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పోలవరం–నల్లమలసాగర్ అనుసంధానానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం సరికాదు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పోలవరం–నల్లమలసాగర్ అనుసంధానానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం సరికాదు

  • గోదావరి వరదనీరు వృథా కాకుండా వినియోగమే లక్ష్యం
  • 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న ప్రకటన
  • పెట్టుబడులు, ఉద్యోగాల్లో ఏపీ ముందంజలో ఉందని వ్యాఖ్య
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
పోలవరం–నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం సమర్థనీయం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఏటా 3,500 టీఎంసీల గోదావరి వరదనీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుందని, అందులోంచి 200 టీఎంసీలను నల్లమలసాగర్‌కు తరలించే యోచనలో ఉన్నామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హితవు పలికారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేసి పోలవరాన్ని వంశధారతో అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. గడిచిన 20 నెలల్లో సంకీర్ణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పరిస్థితులపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు విశాఖకు వస్తున్నాయని వెల్లడించారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు కర్మాగారం, రామాయపట్నం వద్ద భారీ చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ప్రజారోగ్య సేవల మెరుగుదల కోసం ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ ఆరోగ్య రికార్డులు రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ నెల 16న బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనకు రానున్నారని వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తప్పక నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Comments

-Advertisement-