పురపోరులో క్యాంపు రాజకీయాలపై ఎస్‌ఈసీ అప్రమత్తం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
పురపోరులో క్యాంపు రాజకీయాలపై ఎస్‌ఈసీ అప్రమత్తం
16 వరకు ఎన్నికల నియమావళి అమల్లోనే
ముగ్గురికి మించి గుంపులు నిషేధం
విజేతలు డిక్లరేషన్ తప్పనిసరి
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు జోరందుకోవడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 16న ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 16 ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విజేతలను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. పలు చోట్ల స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై స్పందించిన ఎన్నికల సంఘం విజేతలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందజేయాలని సూచించింది. నిఘా బృందాలను మరింత అప్రమత్తం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ అమలులో ఉండడంతో ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని పేర్కొంది. ముందస్తు అనుమతి లేకుండా ప్రైవేట్, టూరిస్టు బస్సుల్లో ప్రయాణించవద్దని సూచించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే విజేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Comments
