గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏఐపై ముఖ్యమంత్రి సమీక్ష
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏఐపై ముఖ్యమంత్రి సమీక్ష
- శంతను నారాయణ్‌తో ఉన్నత స్థాయి భేటీ
- యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌పై దృష్టి
- తెలంగాణ రైజింగ్-2047 విజన్ దిశగా చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్): గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ ప్రభావం, యువతకు స్కిల్లింగ్–రీస్కిల్లింగ్ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అడోబ్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచవ్యాప్తంగా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో జరుగుతున్న మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు దేశాలు తీసుకుంటున్న అడుగులు, ఏఐ విప్లవం ఆర్థిక వ్యవస్థపై చూపిస్తున్న ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలపై సమావేశంలో సమగ్ర సమీక్ష జరిగింది. తెలంగాణను శక్తివంతమైన తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు విధానాలు, మౌలిక వసతులు, ఆవిష్కరణ వాతావరణం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సుస్థిర పారిశ్రామిక వృద్ధి దిశగా వ్యూహాత్మక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏఐలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఉద్యోగావకాశాల స్వరూపాన్ని మార్చుతున్న నేపథ్యంలో యువతను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయడం అత్యవసరమని ముఖ్యమంత్రి అన్నారు. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను బలోపేతం చేసి సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి యాత్రను వేగవంతం చేసేందుకు సాంకేతిక, తయారీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో మరింత సహకారం అందించాలని శంతను నారాయణ్‌ను ముఖ్యమంత్రి కోరారు.
Comments
