రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

- ఉగాది లోపు మంజూరు పత్రాల పంపిణీ లక్ష్యం

- సొంత స్థలం ఉన్న పేదలకు తొలి ప్రాధాన్యం

- మోడల్ కాలనీలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
నగరంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉగాది పండుగలోపు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. సుమారు 12 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రాథమిక పరిశీలనలో 18 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఆదాయ పరిమితి, భూ యాజమాన్య పత్రాలు, కుటుంబ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను వారం రోజుల్లో ఖరారు చేయాలని భావిస్తున్నారు. సొంత స్థలం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేని పేదలకు తొలి విడతలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇలాంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది. అదేవిధంగా మురికివాడల్లో నివసించే వారి కోసం ఇందిరమ్మ మోడల్ కాలనీలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జీవనోపాధి దెబ్బతినకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఐదు నుంచి పది అంతస్తుల భవనాలు నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నగరంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న 28 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా, రెండున్నర లక్షల మంది నిర్మాణ పనులు ప్రారంభించారు. వచ్చే నెలాఖరు నాటికి లక్ష ఇళ్లను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

-Advertisement-