రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అచ్యుతాపురం మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అచ్యుతాపురం మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం

  • దట్టమైన పొగలతో ప్రాంతంలో ఆందోళన
  • షార్ట్ సర్క్యూట్ అనుమానం
  • లక్షల్లో ఆస్తి నష్టం అంచనా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):
అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక కేంద్రమైన అచ్యుతాపురం జంక్షన్ సమీపంలోని కేఆర్ మార్ట్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మార్ట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన సిబ్బంది, వినియోగదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మార్ట్‌లో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లో ఎగసిపడ్డాయి. ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మార్ట్‌లోని వస్తువులు పూర్తిగా దగ్ధమవడంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని యాజమాన్యం అంచనా వేస్తోంది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే పనులు కొనసాగుతున్నాయి.

Comments

-Advertisement-