మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో గుడిమల్లం దేవస్థానంలో పట్టు వస్త్రాల సమర్పణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో గుడిమల్లం దేవస్థానంలో పట్టు వస్త్రాల సమర్పణ
- మంత్రి ఆనం నారాయణ చేతుల మీదుగా సమర్పణ
- ఆగమ శాస్త్ర ప్రకారం ఘనంగా నిర్వహణ
- ఆలయ మర్యాదలతో స్వాగతం, వేద ఆశీర్వచనం
తిరుపతి జిల్లా, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం లోని శ్రీ పరుశురామేశ్వర స్వామి దేవస్థానంలో పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తుల నడుమ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం సంప్రదాయబద్ధంగా సాగింది. మంత్రి ఆనం నారాయణ స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తో కలిసి శ్రీ ఆనందవల్లి సమేత పరుశురామేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని విధివిధానాలతో సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆనం నారాయణకు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతించి సత్కరించారు. అనంతరం పట్టు వస్త్రాల సమర్పణ పూర్తయ్యాక స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వహణాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
Comments

