రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కుమ్మెర బాధితులకు అండగా ఎస్సీ ఎస్టీ కమిషన్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కుమ్మెర బాధితులకు అండగా ఎస్సీ ఎస్టీ కమిషన్

  • నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు
  • బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
  • వేగవంతమైన దర్యాప్తు, త్వరిత న్యాయం హామీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
జిల్లాలోని కుమ్మెర ఘటన బాధితులకు అండగా నిలుస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో కమిషన్ సభ్యుడు శంకర్‌తో కలిసి బాధితులను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మరియు ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు ప్రక్రియ, నిందితులపై తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం వంటి అంశాలపై ఆరా తీశారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని, నిందితులకు కఠిన శిక్షలు అమలు అయ్యే వరకు కమిషన్ పక్షాన నిలుస్తామని హామీ ఇచ్చారు. దర్యాప్తును వేగవంతం చేసి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. 1989 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

కుమ్మెర ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు తెలిపారు. కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కు అందజేశారు. వచ్చే మూడు నెలల పాటు నిత్యవసర సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, గణేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై జిల్లా కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు.

Comments

-Advertisement-