సికింద్రాబాద్ మార్గంలో ఉదయాన్నే విస్తృత పరిశుభ్రత తనిఖీలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
సికింద్రాబాద్ మార్గంలో ఉదయాన్నే విస్తృత పరిశుభ్రత తనిఖీలు
- ఇందిరా పార్క్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కమిషనర్ పర్యటన
- చెత్త సేకరణ, సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి
- నిర్లక్ష్యంపై కఠిన చర్యల హెచ్చరిక
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సికింద్రాబాద్ మార్గంలో ఉదయం విస్తృత పరిశుభ్రత తనిఖీలు నిర్వహించారు. జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ఇందిరా పార్క్, గాంధీనగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పరిశీలించారు. ఈ తనిఖీలలో సురభి పార్క్, పి అండ్ టి కాలనీ, గాంధీనగర్ విభాగం, కవాడిగూడ ప్రాంతాలను సందర్శించి పరిశుభ్రత స్థితి, చెత్త సేకరణ సామర్థ్యం, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ప్రతి రోజు ఇంటింటికీ చెత్త సేకరణ శాతం పూర్తిగా జరుగుతున్నదా అన్న విషయాన్ని ధృవీకరించారు చెత్త సేకరణ వాహనాల హాజరు, కేటాయించిన మార్గాల్లో సక్రమంగా తిరుగుతున్నాయా అనే అంశాలను పరిశీలించారు. మార్గాలు మిస్ అయితే లేదా సేకరణలో అవకతవకలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రదేశాలు, రహదారులు, ప్రధాన కూడళ్ల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
స్థానిక నివాసితులు, వ్యాపారులతో కమిషనర్ మాట్లాడి పరిశుభ్రత సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చెత్తను వర్గీకరించి నిర్ణీత సమయాల్లోనే అందజేయాలని వ్యాపారులకు సూచించారు. నగరంలోని ప్రతి ప్రాంతం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.
Comments
