రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లడ్డూ కల్తీపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

లడ్డూ కల్తీపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

వైసీపీ నేతలపై ఘాటైన విమర్శలు

సభలో ఆధారాలు చూపాలని సవాల్

హిందూ భావోద్వేగాలపై రాజకీయం చేయొద్దని హెచ్చరిక

అమరావతి, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పార్టీకి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయానికి వెళ్తూ హిందూ సంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడంపై ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హెరిటేజ్ సంస్థపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానేయాలని, ధైర్యముంటే సభలో స్పష్టమైన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతభావాలను ఉపయోగించకూడదని హెచ్చరించారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించి హిందూ ధర్మంపై దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Comments

-Advertisement-