రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

  • తాడేపల్లిలో కీలక భేటీ.. రాజకీయ పరిస్థితులపై చర్చ
  • తప్పుడు కేసులకు భయపడొద్దని జగన్ భరోసా
  • ప్రజా పోరాటం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఇటీవల బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేసుల వ్యవహారం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులపై ఆందోళన చెందవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొందామని, న్యాయపరమైన పోరాటంతో ముందుకు సాగాలని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని అంబటి రాంబాబుకు సూచించినట్లు సమాచారం. కొంతమంది పోలీసు అధికారుల వ్యవహారశైలిపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ భేటీలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

-Advertisement-