రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

యనమలకుదురు శివాలయంలో రూ.10 లక్షల నగదు మాయం… పరారీలో ఈవో

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

యనమలకుదురు శివాలయంలో రూ.10 లక్షల నగదు మాయం… పరారీలో ఈవో

  • హుండీ తాళం మార్చి నగదు చోరీ చేసినట్లు ఆరోపణలు
  • ఇద్దరు పూజారులతో పాటు మరొకరు అరెస్ట్
  • దేవాదాయశాఖ విచారణ కొనసాగింపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విజయవాడ, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్) :
విజయవాడ సమీపంలోని యనమలకుదురు శివాలయంలో రూ.10 లక్షలకు పైగా నగదు మాయం అయిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై దేవాదాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవోతో పాటు అర్చకులు కలిసి అంతరాలయంలోని హుండీకి మారు తాళం తయారు చేసి నగదు చోరీ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హుండీ నుంచి నగదు పంపకాల సమయంలో తేడాలు రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. సమాచారం ప్రకారం నగదు పంపకాల విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో కొందరు మద్యం దుకాణంలో చర్చించుకోవడం వల్ల విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు పూజారులతో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో ప్రధాన పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన దేవాదాయశాఖ అధికారులు తమ నివేదికను కమిషనర్‌కు పంపించారు. ఈవో భవానీ స్థానంలో కానూరు ప్రాంతానికి చెందిన మరో అధికారిని తాత్కాలికంగా నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ వ్యవహారాలపై మరింత పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Comments

-Advertisement-