80 ఏళ్ల వయసులో స్వర్ణ పథకాల వర్షం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
80 ఏళ్ల వయసులో స్వర్ణ పథకాల వర్షం
- రన్నర్ రామ సుబ్బమ్మకు ఘన సన్మానం
- వేమిరెడ్డి దంపతుల సత్కారం
- జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ
- ఇల్లు కేటాయింపుకు హామీ
నెల్లూరు, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): నెల్లూరు జిల్లాలో 80 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రతిభతో మెరిసిన వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మను ఘనంగా సత్కరించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆదివారం తమ నివాసంలో ఆమెను సన్మానించారు. కావలికి చెందిన రామ సుబ్బమ్మ ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన విజయాలను అభినందించిన నాయకులు, ఈ వయసులో జాతీయ స్థాయిలో సాధించిన పతకాలు గొప్ప విషయమని ప్రశంసించారు. రామ సుబ్బమ్మ ఇప్పటివరకు 32 స్వర్ణ పతకాలు, 14 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించడం విశేషమని తెలిపారు. ఆమె పట్టుదల, కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని రామ సుబ్బమ్మ నిరూపించారని, యువతకు కూడా ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. క్రీడలపై ఆసక్తి, క్రమశిక్షణతో సాధించిన విజయాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా రామ సుబ్బమ్మ తనకు ప్రభుత్వం తరఫున ఇల్లు కేటాయించేలా చూడాలని ఎంపీ దంపతులను కోరారు. దీనిపై స్పందించిన వారు, తప్పకుండా ఇల్లు కేటాయించేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సన్మానం కార్యక్రమం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రామ సుబ్బమ్మ సాధించిన విజయాలు మరింత మంది వృద్ధులకు స్ఫూర్తిగా నిలుస్తాయని, వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
