రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నీటి ప్లాంట్లపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిక

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నీటి ప్లాంట్లపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిక

  • ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఘాటైన స్పందన
  • గల్ఫ్ దేశాలకు పరోక్షంగా వార్నింగ్
  • ‘నీటి యుద్ధం’ వైపు పరిస్థితులు?

మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని తెరవాలని 48 గంటల గడువు విధించిన నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగితే, పశ్చిమాసియాలోని శత్రుదేశాల మంచినీటి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాలు తమ తాగునీటి అవసరాల్లో దాదాపు 90 శాతం సముద్రపు నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్లాంట్లపై చిన్న స్థాయి దాడి జరిగినా కోట్లాది మంది ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే నీటి శుద్ధి కేంద్రాల పునరుద్ధరణ చాలా క్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల తమపై దాడి జరిగితే శత్రుదేశాల ప్రాథమిక అవసరాలనే దెబ్బతీసేలా ఇరాన్ వ్యూహం రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటనతో అమెరికాకే కాకుండా, ఆ దేశ మిత్ర దేశాలైన అరబ్ దేశాలకు కూడా పరోక్షంగా హెచ్చరికలు వెళ్లినట్లయింది. ఇక హర్మూజ్ జలసంధి వివాదం ఇప్పుడు ‘నీటి యుద్ధం’ దిశగా మళ్లుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ, ఇరు దేశాల నుంచి వస్తున్న కవ్వింపు వ్యాఖ్యలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. పరిస్థితులు మరింత విషమించే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Comments

-Advertisement-