రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కోమటి జయరాంకు ఘన అభినందన సభ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కోమటి జయరాంకు ఘన అభినందన సభ

- ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరణ

- విజయవాడలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం

- ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న వేడుక

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విజయవాడ, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో ఘనంగా ‘ఆత్మీయ అభినందన సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ పాల్గొని కోమటి జయరాంకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం వైభవంగా సాగగా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచడం వంటి అంశాల్లో ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పాత్ర కీలకమని పేర్కొన్నారు. కోమటి జయరాం తన అనుభవం, పరిచయాలతో రాష్ట్రానికి మరింత మేలు చేసే విధంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అభినందన సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే పలువురు కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని కోమటి జయరాంకు అభినందనలు తెలియజేశారు. కోమటి జయరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులు మరియు పెట్టుబడిదారులతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

Comments

-Advertisement-