రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మన్రేగా పరిరక్షణ యాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిల

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మన్రేగా పరిరక్షణ యాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిల

- తిమ్మరాజుపేటలో రచ్చబండ కార్యక్రమం

- శ్రామికుల సమస్యలు విన్న వైఎస్ షర్మిల

- 100 రోజుల ఉపాధి హామీ అమలు చేయాలని డిమాండ్

అనకాపల్లి, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఎలమంచిలి నియోజకవర్గంలోని తిమ్మరాజుపేట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులు, శ్రామికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల అమలు తీరుపై గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా శ్రామికులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజుల పని కల్పించాల్సి ఉన్నప్పటికీ తమకు పూర్తి స్థాయిలో పని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు కూడా వేతనాలు సమయానికి అందడం లేదని, నిబంధనల పేరుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ కుటుంబాల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు రూపొందించిన మన్రేగా చట్టం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పేదరికాన్ని తగ్గించడంతో పాటు వలసలను నివారించవచ్చని పేర్కొన్నారు. శ్రామికులకు 100 రోజుల పని హామీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, శ్రామికులకు వారి హక్కుగా ఉన్న ఉపాధి అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మన్రేగా పునరుద్ధరణ పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-