రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పెట్రోల్ కొరత లేదని కేంద్రం స్పష్టం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పెట్రోల్ కొరత లేదని కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):

 దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందనే వార్తలపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని ఇంధన విక్రయ కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు పౌరులకు కొన్ని ముఖ్య సూచనలు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్రం వెల్లడించింది. అందువల్ల భవిష్యత్తు అవసరాల కోసం పెట్రోల్ లేదా డీజిల్‌ను ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని ప్రజలను కోరింది. ఇలా నిల్వ చేయడం ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరించింది. పెట్రోల్ బంకుల వద్ద అనవసర రద్దీని సృష్టించకుండా సాధారణ అవసరాలకు సరిపడా మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించింది.

ఇంధన సరఫరా, రవాణా ప్రక్రియలో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద నిబంధనలను ఉల్లంఘించే వారిపై, అనధికారికంగా ఇంధనాన్ని తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే చమురు సంస్థలు సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇంధన పంపిణీ నిరాటంకంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

Comments

-Advertisement-