రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఉద్యాన యాంత్రీకరణతో రైతుల అభివృద్ధి లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఉద్యాన యాంత్రీకరణతో రైతుల అభివృద్ధి లక్ష్యం

- మంత్రి దామోదర రాజనర్సింహ

- రైతులకు మినీ ట్రాక్టర్ల పంపిణీ

- సబ్సిడీపై ఆధునిక యంత్రాల అందజేత

- రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ కట్టుబాటు

సంగారెడ్డి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):

రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ సముదాయంలో రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి రూ.4.9 లక్షల విలువ గల 20 హెచ్‌పి సామర్థ్యంతో ఉన్న మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేశారు. రైతులు ఆధునిక యంత్రాలను వినియోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం మరియు ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ కీలకమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని సూచించారు. రైతుల సంక్షేమం మరియు ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జ్యోతి తదితర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-