రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అరండల్‌పేటలో రజక భవన్ ప్రారంభం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అరండల్‌పేటలో రజక భవన్ ప్రారంభం

- మూడు అంతస్తుల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

- బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

- సమాజ కార్యక్రమాలకు కేంద్రంగా రజక భవన్

గుంటూరు, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

గుంటూరు నగరంలోని అరండల్‌పేట ప్రాంతంలో నిర్మించిన మూడు అంతస్తుల రజక భవనాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘనంగా ప్రారంభించారు. 52వ డివిజన్ అరండల్‌పేట 12/2 లైన్‌లో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, కమ్యూనిటీ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బీసీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీయే కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. రజక సమాజం ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్న రజక భవన్ ప్రారంభం కావడం ఆనందదాయకమని ఎమ్మెల్యే తెలిపారు. గత ఐదేళ్లలో ఈ భవనం నిర్మాణానికి పెద్దగా పురోగతి లేకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ భవనం ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. భవనం నిర్మాణానికి సాంబశివరావు, కోటేశ్వరరావు తమ సొంత నిధులతో ముందుండి సహకరించడం అభినందనీయమని అన్నారు. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ రజక భవన్‌లో సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రజక సమాజానికి ఇది ఒక కేంద్రంగా ఉపయోగపడుతుందని చెప్పారు. రజక సమాజం తనను తమ ఆడపడుచుగా భావించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Comments

-Advertisement-