రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కేజీబీవీ పాఠశాలకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కేజీబీవీ పాఠశాలకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

- 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా పరిశీలన

- విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్

- ఉపాధ్యాయులకు సమయపాలనపై హెచ్చరిక

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నిర్మల్, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
జిల్లాలో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెల్లవారుజామున కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, నిర్వహణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న అసెంబ్లీ కార్యక్రమం, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మెస్ నిర్వహణ మరియు బోధన పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పెంచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ రాజు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-