బీజేపీ అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బీజేపీ అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం
- రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం
- మీడియా వేదికగా పార్టీ వాణి బలంగా వినిపించాలని పిలుపు
- ప్రజా సమస్యలపై పోరాటానికి వ్యూహాల చర్చ
హైదరాబాద్, 16 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మీడియా వేదికగా పార్టీ వాణిని మరింత బలంగా వినిపించాలనే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించి నూతనంగా నియమితులైన పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే బాధ్యత అధికార ప్రతినిధులపై ఉందని తెలిపారు. మీడియా వేదికగా ప్రజలకు నిజాలను తెలియజేయాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని నాయకులకు సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాలపై నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, గౌతమ్ రావు, ఎన్.వి. సుభాష్‌తో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు పిలుపునిచ్చారు.
Comments
