రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శ్రీకాకుళం జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రంలో చర్చలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శ్రీకాకుళం జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రంలో చర్చలు

- నితిన్ గడ్కరీతో భేటీ అయిన కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు

- ఎన్‌హెచ్–16 ఆరు వరుసల విస్తరణకు విజ్ఞప్తి

- కొత్త రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని ప్రతిపాదన

న్యూఢిల్లీ, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. గడ్కరీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో రహదారి మౌలిక వసతుల విస్తరణపై కీలక అంశాలు చర్చించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న చెన్నై–కలకత్తా జాతీయ రహదారి 16ను ఆరు వరుసలుగా విస్తరించాల్సిన అవసరాన్ని రాంమోహన్ నాయుడు వివరించారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని నవభారత్ కూడలి సహా పలు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ల నిర్మాణం అవసరమని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఉన్న కళింగపట్నం–శ్రీకాకుళం–పార్వతీపురం మార్గం (145 కిలోమీటర్లు), గార–అలికాం–బత్తిలి మార్గం (118 కిలోమీటర్లు)లను జాతీయ రహదారులుగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ మార్గాలు అభివృద్ధి చెందితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అవసరాలను గడ్కరీ సానుకూలంగా స్వీకరించారని రాంమోహన్ నాయుడు తెలిపారు. సంబంధిత ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని తన శాఖ అధికారులకు గడ్కరీ ఆదేశించడం శుభపరిణామమని అన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ద్వారా శ్రీకాకుళం జిల్లా మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-