ప్రవాసాంధ్రుల భద్రతపై సీఎం సమీక్ష
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రవాసాంధ్రుల భద్రతపై సీఎం సమీక్ష
- కేంద్రంతో సమన్వయం చేయాలని అధికారులకు ఆదేశాలు
- హెల్ప్‌లైన్‌లు, వాట్సాప్ నంబర్ 24 గంటలు అందుబాటులో
- ఆర్టీజీఎస్–ఏపీ ఎన్ఆర్టీ కలిసి సహాయక చర్యలు
అమరావతి, మార్చి 2 (పీపుల్స్ మోటివేషన్): పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ అధికారులు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం సూచించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని నేరుగా సంప్రదించి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సహాయక చర్యల విషయంలో ఆర్టీజీఎస్ మరియు ఏపీ ఎన్ఆర్టీ సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 0863-2340678 హెల్ప్‌లైన్ నెంబర్, 85000 27678 వాట్సాప్ నెంబర్‌ను 24 గంటలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
అదనంగా helpline@apnrts.com
ఈమెయిల్ చిరునామాలు, అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రవాసాంధ్రులు సంప్రదించిన వెంటనే సహాయం అందేలా వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
