రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాజ్యసభ అభ్యర్థులపై టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రాజ్యసభ అభ్యర్థులపై టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

  • బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయం
  • కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శ
  • మావోయిస్టుల అంశంపై స్పందన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 3 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమర్థులైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం కోరుతున్నారని, ఒకటి లేదా రెండు స్థానాల కేటాయింపుపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దల సభకు కేవలం కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యం ఇచ్చిందని, తెలంగాణ కోసం పోరాడిన నాయకులను విస్మరించిందని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మార్చి నెలలో కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా చేపడతామని వెల్లడించారు. మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ, దశాబ్దాలుగా సిద్ధాంతం కోసం పనిచేసిన వారిపై తమకు గౌరవం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధమవుతూనే, మావోయిస్టులతో చర్చలకు నిరాకరించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగార్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

లొంగిపోయిన మావోయిస్టులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యమవడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Comments

-Advertisement-