తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- పద్మావతీపురంలో ఘనంగా కార్యక్రమం
- కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన నాయకులు
- ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు
తిరుపతి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): తిరుపతి నగరంలోని పద్మావతీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌ను కట్ చేసి పార్టీ 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక సంబరాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నియోజకవర్గం ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడని పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కూడా వారు ఆరోపించారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీ సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
