పహాడీ షరీఫ్‌లో ఈ-వ్యర్థాల డ్రైవ్ పరిశీలన
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
పహాడీ షరీఫ్‌లో ఈ-వ్యర్థాల డ్రైవ్ పరిశీలన
- ఈద్‌గాహ్ పరిసరాల్లో పారిశుధ్యంపై సమీక్ష
- రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లకు ఆదేశాలు
- శుభ్రత, ప్రజా సౌకర్యాలపై దృష్టి
హైదరాబాద్, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్): జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పహాడీ షరీఫ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ-వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపడుతున్న చర్యలను సమీక్షించి ఈ-వ్యర్థాల సేకరణ, నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అనంతరం పహాడీ షరీఫ్‌లోని ఈద్‌గాహ్‌ను కమిషనర్ సందర్శించి అక్కడి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈద్‌గాహ్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈద్‌గాహ్ వద్ద భక్తుల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులకు తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, చెత్త సేకరణ, ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. రంజాన్ సందర్భంగా ఈద్‌గాహ్ మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. రంజాన్ సందర్భంగా ఈద్‌గాహ్ మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
Comments
