రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గ్యాస్ కొరత వేళ బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గ్యాస్ కొరత వేళ బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు

  • ఆరుగురు అరెస్ట్ – 24 మందిపై కేసులు నమోదు
  • గ్యాస్ గోదాంలలో విస్తృత సోదాలు
  • హార్ముజ్ సంక్షోభం పేరుతో అక్రమ విక్రయాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

లక్నో, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):
గ్యాస్ కొరత నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి 24 మందిపై కేసులు నమోదు చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడినట్లు వార్తలు రావడంతో దేశంలో గ్యాస్ కొరతపై పుకార్లు వ్యాపించాయి. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఆందోళన పెరగడంతో గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ అధికమైంది. ఈ పరిస్థితిని కొందరు డిస్ట్రిబ్యూటర్లు మరియు మధ్యవర్తులు ఆసరాగా చేసుకుని గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధిక ధరలు చెల్లించిన వారికి గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో లక్నో నగరంలో మొత్తం 1,483 ప్రాంతాల్లో ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో నాలుగు కేసులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై, మరో 20 కేసులు ఇతర వ్యక్తులపై నమోదు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తూ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

Comments

-Advertisement-