రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వెలుగుమట్ల బాధితుల కోసం కవిత దీక్ష విరమణ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వెలుగుమట్ల బాధితుల కోసం కవిత దీక్ష విరమణ

- ప్రభుత్వ హామీతో నిరవధిక దీక్ష ముగింపు

- జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేత

- పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరవధిక దీక్షను విరమించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్‌కు దీక్షను విరమింపజేశారు. వెలుగుమట్ల భూదాన్ భూమి సమస్యపై ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వెలుగుమట్లలో అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 412 మందిని గుర్తించి పట్టాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వెలుగుమట్ల పేదలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో దీక్షను విరమించినట్లు కవిత పేర్కొన్నారు. పట్టాలు పొందిన వారు త్వరలోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. దీక్ష విరమణ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పోరాటం పూర్తిగా ముగియలేదని, కేవలం విరామం మాత్రమే అని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనలు, మహిళల నిరసనల కారణంగానే ప్రభుత్వం స్పందించిందని కవిత పేర్కొన్నారు.

Comments

-Advertisement-