తిరుమలపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: భానుప్రకాష్ రెడ్డి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
తిరుమలపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: భానుప్రకాష్ రెడ్డి
- టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నం అంటూ విమర్శలు
- పాత ఘటనలను కొత్తగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
- తిరుపతి ప్రెస్ క్లబ్‌లో టీటీడీ పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలు
తిరుపతి, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్): తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
దాదాపు 11 నెలల క్రితం జరిగిన ఒక పాత ఘటనను తాజాగా జరిగినట్లుగా చూపిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తిరుమలలో పరకామణి వద్ద చోరీకి ప్రయత్నించిన పెంచలయ్య అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని పట్టుకుని జైలుకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో జరిగిన రవికుమార్ దొంగతనం ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో ఆ ఘటనపై ఆధారాలు, వీడియోలను మాయం చేశారని ఆరోపిస్తూ అప్పటి అధికారులను ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే వైసీపీ నేతల లక్ష్యమని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే కానుకలపై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Comments
