రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం ముంబై పర్యటన ఫలప్రదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం ముంబై పర్యటన ఫలప్రదం

  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలపై ఆనందం
  • విశాఖలో భారీ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు ప్రతిపాదన
  • క్రియేటివ్ సిటీ ఏర్పాటు లక్ష్యంగా చర్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను నిర్వహించిన ముంబై పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపినందుకు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ప్రశంసలు తనలో మరింత ఉత్సాహాన్ని నింపాయని ఆయన తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఐఏఏపీఐ ఎక్స్‌పోలో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర పర్యాటక విధానం, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ప్రముఖ సంస్థ మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో రూ.100 కోట్ల పెట్టుబడితో భారీ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. ముంబై పర్యటన సందర్భంగా ఏఐ ఆధారిత సినిమా నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై యూరోస్ సంస్థ ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి కొత్త అవకాశాలను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Comments

-Advertisement-