వైసీపీపై మంత్రి నారా లోకేశ్ విమర్శలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
వైసీపీపై మంత్రి నారా లోకేశ్ విమర్శలు
- దేవాలయాలపై దాడులంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- ప్రజల్లో మత విభేదాలు రేపే ప్రయత్నమని వ్యాఖ్య
- నిజానిజాలు తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
అమరావతి, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రచారం అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతోందంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని లోకేశ్ ఆరోపించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో ఉన్న శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోలను తప్పుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థమండపం రాతి నిర్మాణ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల తీర్మానం, ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఫిబ్రవరి 28న శాస్త్రోక్తంగా పాత ఆలయాన్ని తొలగించినట్లు మంత్రి వివరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Comments
