రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఖతార్ సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఖతార్ సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదం 

  • 6 మంది మృతి, ఒకరు గల్లంతు
  • సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం
  • సముద్రంలో ముమ్మర గాలింపు చర్యలు
  • ఉద్రిక్త పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చిన అధికారులు

మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): మధ్యప్రాచ్య దేశమైన ఖతార్లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన సైనిక హెలికాప్టర్ సముద్ర జలాల్లో కుప్పకూలడంతో ఆరుగురు సిబ్బంది మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు అత్యవసర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, విధి నిర్వహణలో ఉన్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది. ఎక్స్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, సాధారణ డ్యూటీలో ఉన్న సమయంలో హెలికాప్టర్ అకస్మాత్తుగా సమస్యకు గురై దేశ జలాల్లో కూలిపోయిందని వెల్లడించింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో ఆరుగురి మృతదేహాలను ఇప్పటికే వెలికితీశారు. గల్లంతైన వ్యక్తి కోసం కోస్ట్ గార్డ్, సరిహద్దు భద్రతా దళాలు, అంతర్గత భద్రతా విభాగం ప్రత్యేక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమేనని, ఎలాంటి శత్రుచర్యల సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ రకం, కూలిన ఖచ్చితమైన ప్రదేశం వంటి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Comments

-Advertisement-