రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కర్నూలులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కర్నూలులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

  • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
  • చెరువులోకి తోసి తానూ దూకిన తల్లి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కర్నూలు, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో గార్గేయపురం ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం గార్గేయపురం గ్రామానికి చెందిన రాజేశ్వరి (35) అనే వివాహితకు కుటుంబ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఆమె తన ఇద్దరు కుమారులు అబ్రహం (3), సుకుమార్ (6)లను తీసుకుని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి అనంతరం తానూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులో నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

-Advertisement-